యానిమల్ 11డేస్ కలెక్షన్స్ 

animal 11 days collections

బాక్సాఫీస్ వద్ద యానిమల్ వేట కొనసాగుతూనే వుంది.రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన కూడా ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సాలిడ్ వసూళ్లను రాబడుతూ కొత్త రికార్డులను క్రీయేట్ చేస్తుంది.నార్త్ లో అయితే తిరుగులేని హోల్డ్ తో వసూళ్లను రాబడుతుండగా సౌత్ లో డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక 11 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 737.98కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ఇందులో దేశ వ్యాప్తంగా హిందీ నెట్ 401.49కోట్లు.అంతేకాదు కేవలం 11రోజుల్లోనే  ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించి జవాన్ సరసన నిలిచింది.ఓవరాల్ గా హిందీ లో 400 కోట్ల నెట్ క్లబ్ లో చేరిన 6వ సినిమాగా యానిమల్ రికార్డు సృష్టించింది.ఇంతకుముందు జవాన్ తోపాటు పఠాన్,గదర్ 2,బాహుబలి 2,కెజియఫ్ 2సినిమాలు ఈఫీట్ సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యానిమల్ జోరు చూస్తుంటే 1000కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించేలానే వుంది.ఎలాగూ సలార్,డంకి వచ్చే సరికి మరో 10రోజుల సమయం వుండడంతో ఈలోగా యానిమల్ ఆపని పూర్తి చేసేలానే వుంది.ఇక ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది.దాదాపు అన్ని ఏరియాల్లో ప్రాఫిట్స్ ను రాబట్టుకుంది.తెలుగు వెర్షన్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా 11రోజుల్లో 65కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇందులో షేర్ 30కోట్ల పైనే.కేవలం 14కోట్ల టార్గెట్ బరిలోకి దిగిన ఈసినిమా అంతకు రెండింతలు వసూళ్లను రాబట్టుకుంది.

యానిమల్ రణబీర్ కపూర్ కెరీర్ లోనే  బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన  ఈసినిమా ఆ అంచనాలకు మించి వసూళ్లను రాబడుతూ షాక్ ఇస్తుంది.ఆల్ టైం బ్లాక్ బాస్టర్ హిందీ సినిమాల్లో యానిమల్ స్థానం సంపాదించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.