స్టార్ హీరోయిన్ సమంత కూడా సేవా కార్యక్రమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రత్యూష పౌండేషన్ ద్వారా పలు సేవలు అందిస్తుంది. ఇప్పుడు మరో మంచి పని చేసి ప్రశంసలు అందుకంటుంది. న్యాచురుల్ స్టార్ నాని హీరోగా శౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా హాయ్ నాన్న. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఇంప్రెస్ అయిన స్టార్ హీరోయిన్ సమంత అనాథ చిన్నారుల కోసం స్పెషల్ స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో చిన్నారుల కోసం హాయ్ నాన్న స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. దీంతో సమంత చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Beautiful in & out ♥️@Samanthaprabhu2 hosts a special screening of #HiNanna for the kids from Prathyusha Organisation at #AMBCinemas today! 💫#BlockbusterNanna pic.twitter.com/AuBz2pS1r2
— Vyra Entertainments (@VyraEnts) December 10, 2023
కాగా అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసిన న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఎమోషనల్ ప్లస్ లవ్ ఎంటర్ టైనర్ గా ఎన్నో అంచనాల మధ్య డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా సూపర్ హిట్ ను అందుకుంది. మరోసారి నాని ఎమోషనల్ కంటెంట్ ను ఎలా పండిస్తాడో ఈసినిమాతో నిరూపించారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల నుండి ప్రశంసలు కూడా దక్కాయి.
కాగా ఈసినిమాలో ఇంకా బేబి ఖైరా తో పాటు జయ రామ్, ప్రియదర్శి ,విరాజ్ అశ్విన్ పలు కీలక పాత్రల్లో నటించారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి,విజేందర్ రెడ్డి తీగల ఈసినిమాను నిర్మించారు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా.. షాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: