విజయవాడలో సైంధవ్‌ టీమ్.. కనకదుర్గమ్మను దర్శించుకున్న వెంకటేష్

Venkatesh Visits Vijayawada Kanaka Durga Temple Along with Saindhav Team

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇది వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రం కావడం విశేషం. ఇక ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా వచ్చే జనవరి 13న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సైంధవ్ టీమ్ మూవీ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగా.. సోమవారం (డిసెంబర్ 11, 2023) ‘సైంధవ్‌’ టీమ్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలో హీరో వెంకటేష్ సహా చిత్ర ద‌ర్శ‌కుడు శైలేష్‌ కొలను, శ్రద్ద శ్రీనాథ్‌లు ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గ అమ్మవారిని ద‌ర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. అనంత‌రం నగరంలోని ప్రముఖ బాబాయ్ హోటల్‌కు వెళ్లిన యూనిట్ సభ్యులు టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వారితో కొద్దిసేపు ముచ్చటించారు. ఇక సైంధవ్‌ యూనిట్ విజయవాడ పర్యటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమా నుంచి ఇటీవలే లాంఛ్‌ చేసిన సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్ రాంగ్ యూసేజ్ ట్రాక్‌ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ క్రమంలో నేడు మూవీ నుంచి మరో సాంగ్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్‌. దీనికోసం VVIT కాలేజ్ మరియు KLU యూనివర్సిటీలను సందర్శించి స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ నిర్వహించారు. కాగా ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. అలాగే కోలీవుడ్‌ స్టార్ హీరో ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్న సైంధవ్‌ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 19 =