నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా తన అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 29న ‘డెవిల్’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. బ్రిటీష్ వారు ఇండియాను పరిపాలించిన కాలానికి సంబంధించిన కథతో తెరకెక్కిన సినిమా కావటంతో నాటి పరిస్థితులను ఆవిష్కరించేలా సినిమాను భారీగా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను అందించారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘డెవిల్’ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. రేపు (డిసెంబర్ 12, 2023) ఈ సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఇక ఇందులో కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే, గూఢచారిగా.. కొత్త తరహా పాత్రను పోషిస్తున్నారు. కాగా నందమూరి కళ్యాణ్ రామ్‌కు ఇలాంటి క్యారక్టర్ చేయడం మొదటిసారి కావడం విశేషం. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమా వీక్షించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘డెవిల్’ దర్శక నిర్మాత అభిషేక్ నామా మరియు కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్, హీరో కళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారు.
Non stop intense action is ready to begin its fireworks 💥#DevilTrailer is releasing on December 12th ❤️🔥#DevilTheMovie#DevilOnDec29th #Devil – The British Secret Agent@NANDAMURIKALYAN @iamsamyuktha_ #MalvikaNair
Directed & Produced by #AbhishekNama@vasupotini @soundar16… pic.twitter.com/y4KPkP7c8C— Telugu FilmNagar (@telugufilmnagar) December 10, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































