టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో చేస్తున్న మోస్ట్ అవైటెడ్‘ఊరు పేరు భైరవకోన’తో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఇప్పుడు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నెం. 26 కోసం సందీప్ కిషన్ మళ్లీ ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టారు. ప్రాజెక్ట్ జెడ్/మాయవన్ సంచలన విజయం తర్వాత సందీప్ కిషన్‌తో సివి కుమార్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్, ప్రాజెక్ట్ జెడ్/మాయవన్ వరల్డ్‌లో సెట్ చేయబడిన సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ చిత్రానికి ‘మాయావన్’ అని టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘మాయావన్’లో హీరోయిన్‌గా ఆకాంక్ష రంజన్ కపూర్ నటిస్తున్నట్లు వెల్లడించారు. ధర్మ ప్రొడక్షన్స్ మొదటి ఓటీటీ చిత్రం ‘గిల్టీ’తో తన నటనను ప్రారంభించి, ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన ఆంథాలజీ సిరీస్ ‘రే’, స్ట్రీమింగ్ సిరీస్ ‘మోనికా ఓ మై డార్లింగ్’లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్.. ఈ చిత్రంలో సందీప్ కిషన్‌కు జోడిగా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇక పైన పేర్కొన్న ఓటీటీ కంటెంట్‌తో ఇప్పటికే తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ ‘మాయావన్’తో వెండితెర ఎంట్రీ ఇస్తున్నారు.
కాగా టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్ విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా వుండబోతుంది. కార్తీక్ కె తిల్లై సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ఆయన గతంలో నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ యాక్షన్ ఫిల్మ్ ‘దసరా’కి చార్ట్‌బస్టర్ ఆల్బమ్ అందించిన సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న పాన్ వరల్డ్ ఫిల్మ్ ‘కల్కి 2898 AD’ కోసం పనిచేస్తున్నారు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రాంబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కిషోర్ గరికిపాటి (జికె) ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: