బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ స్టార్ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు. తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్విరాజ్, చారు శంకర్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేఖ్ ఒబెరాయ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. వైల్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో రణ్‍బీర్ కపూర్ విశ్వరూపం చూపించాడని, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. అలాగే డైరెక్టర్ సందీప్ వంగ టేకింగ్‍కి అందరూ ఫిదా అవుతున్నారు. మరోవైపు ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో యానిమల్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తోంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.550 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రూ. 600 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో వేగంగా రూ.250 కోట్ల మార్కుని చేరుకున్న సినిమాగా నిలిచింది.
HISTORY IS MADE!!#Animal breached a major milestone today. It crossed $10 Million and is now in top 7 grossers of all time in North America for Indian films.
Thank you for all your support! Many more milestones to come!!#Animal10Million #AnimalHuntBegins #AnimalBoxOffice pic.twitter.com/BD9iyaXEpW
— Suresh PRO (@SureshPRO_) December 9, 2023
ఇక ఇదిలా ఉంటే.. యానిమల్ ఇండియాలోనే కాకుండా యూఎస్‌లో సైతం అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో మొత్తం 2.5 మిలియన్ డాలర్లుకు పైగా కొల్లగొట్టి తొలిరోజు కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన మొదటి హిందీ చిత్రంగా నిలిచింది. అలాగే ఉత్తర అమెరికాలో 10 మిలియన్ల డాలర్ల మార్క్‌ని దాటింది. ‘యానిమల్’ సినిమాకు అమిత్ రాయ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎడిటింగ్ చేయడం విశేషం. ఇక మొత్తంగా ఏడుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన ఈ సినిమాను టీ సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్, సినీ1 స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్‌డ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: