నెట్ ఫ్లిక్స్ సీఈఓ తో ఎన్టీఆర్

jr ntr shares interesting post on netflix ceo ted sarandos

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోయి ఏడాది పైన అయిపోయింది. అప్పటికే ఆర్అర్ఆర్ సినిమా కోసమే చాలా ఏళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా వస్తుందా అని చూస్తున్నారు. ప్రస్తుంత ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ ను షేర్ చేశారు. నెట్ ఫ్లిక్స్ సీఈఓ అయిన టెడ్ సరండోస్ ను ఇంటికి పిలిచి, ఆతిథ్యం అందించారు. ఈసందర్భంగా ఎన్టీఆర్ మిమ్మల్నీ మీ టీమ్ ను హోస్ట్ చేయడం ఆనందం గా ఉంది టెడ్ సరండోస్.. మన సంభాషణను చాలా ఎంజాయ్ చేశా అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. దీనికి సంబందించిన ఫోటోలను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Jr NTR (@jrntr)

కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 2 =