బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యానిమల్’. ‘అర్జున్ రెడ్డి’ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు అనిల్ కపూర్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమాలో రణ్‌బీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. దీంతో ‘యానిమల్’ ఐదు రోజుల్లోనే రూ.482 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఈ మూవీ చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం ‘యానిమల్’పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో.. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ‘యానిమల్’ సినిమాపై స్పందించారు. ఇటీవలే సినిమాను వీక్షించిన ఆయన ఈ చిత్రం గురించి, అలాగే చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ పేరులోనే ‘వంగా’ అని ఉన్నప్పుడు.. అతడు విమర్శలకు, విశ్లేషణలకు వంగుతాడనుకోవడం అమాయకత్వం అని అన్నారు. అయితే యానిమల్ చూసిన వారిలో కొందరు.. సినిమా బాగుందని చెప్తే, బాగోదేమోనని సందేహిస్తున్నారని.. కానీ తనకు మాత్రం సినిమా బాలేదంటే, బాగోదేమోనని అనిపిస్తోందని తన స్టైల్‌లో ఫన్నీగా చెప్పారు. మొత్తానికి ఈ సినిమా చూశాక తనకున్న కొన్ని అనుమానాలు, అపోహలు తొలగిపోయాయని పేర్కొన్నారు హరీష్ శంకర్.
Dear Sandeep @imvangasandeep
My take on ANIMAL…. #AnimalMovie pic.twitter.com/Ch8yqlrt0E— Harish Shankar .S (@harish2you) December 6, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: