యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి ఊపిరి పోసుకుంది. ఆమధ్య సరైన సినిమాలు లేక వెలవెలపోయిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆమధ్య జవాన్ రికార్డలు క్రియేట్ చేయగా.. ఇప్పుడు యానిమల్ రికార్డులు క్రియేట్ చేస్తుంది. సందీప్ వంగా దర్శకత్వంలో రణ్‍బీర్ కపూర్ హీరోగా మోస్ట్ వయోలెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈసినిమా వచ్చింది. సందీప్ రెడ్డి మేకింగ్ అండ్ టేకింగ్ స్టైల్, రణబీర్ కపూర్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా మూవీకి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా కలెక్షన్ల ప్రభావం మాత్రం ఎక్కడా ఆగట్లేదు. ఈసినిమా రిలీజ్ అయి వారం రోజుల అవుతున్నా రోజు రోజుకూ కలెక్షన్స్ ను రాబట్టుకుంటూ వెళుతుంది. మొదటిరోజే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. మూడు రోజుల్లో 3 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఐదు రోజుల్లో 400కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇప్పుడు తాజాగాా ఏడు రోజుల్లో 500కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.
#Animal Explosion Continues 🔥🪓#AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalInCinemasNow #AnimalTheFilm #AnimalHuntBegins
Book Your Tickets 🎟️ https://t.co/hQuWWiSKmt#AnimalInCinemasNow #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika… pic.twitter.com/TzwPHe3deM
— Cine1 Studios (@Cine1Studios) December 7, 2023
కాగా ఈసినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించగా.. అనిల కపూర్, బాబి డియోల్, తృప్తి దిమ్రి, బబ్లూ పృథ్వీరాజ్, శక్తి కపూర్, ప్రేమ్ చోప్రా, సురేష్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, మురాద్ నిర్మించారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈసినిమా అమిత్ రాయ్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: