రివ్యూ : హాయ్ నాన్న

hi nanna movie telugu review

నటీనటులు : నాని,మృణాల్ ఠాకూర్,బేబీ కైరా
ఎడిటింగ్ : ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ : షాను జాన్ వర్గీస్
సంగీతం : హేషమ్ అబ్దుల్ వాహబ్
దర్శకత్వం : శౌర్యువ్
నిర్మాతలు : మోహన్ చెరుకూరి,విజేందర్ రెడ్డి తీగల

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మినిమమ్ గ్యాప్ తీసుకోకుండా సినిమాల్లో చేసే హీరోల్లో నాని ముందుంటాడు.దాదాపుగా ఏడాదికి రెండు  సినిమాలతో వస్తాడు. ఈఏడాది సమ్మర్ లో దసరా తో వచ్చి  ఫుల్ మాస్ గా కనిపించి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఇక ఈసినిమా తరువాత తన కంఫర్ట్ జోన్ లో సినిమా చేశాడు అదే హాయ్ నాన్న.ఈసినిమాఫై నాని ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు అందుకే అన్ని తానై  సినిమాను తెగ ప్రమోట్ చేశాడు ఇక ఈసినిమా  ఈ రోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా వుందో  ఇప్పుడు చూద్దాం.

కథ :
విరాజ్ (నాని ) ఫోటోగ్రాఫర్. తన 6ఏళ్ళ కూతురు మహి (కైరా) తో ముంబై లో నివసిస్తాడు.మహికి తన తల్లి గురించి తెలుసుకోవాలని కోరిక అయితే విరాజ్ ఆ టాపిక్ వచ్చినప్పుడల్లా ఏదోఒకటి చెప్పి దాటేస్తుంటాడు. ఈక్రమంలో కైరా ఓ రోజు ఇంట్లోనుండి వెళ్ళిపోతుంది.అక్కడ యష్ణ (మృణాల్ ఠాకూర్ ) పరిచయమవుతుంది.యష్ణ విరాజ్ కు ఫోన్ చేసి మహి ఎక్కడుందో చెప్తుంది అక్కడికి వచ్చిన విరాజ్ యష్ణ ముందే మహి అమ్మ గురించి చెప్తాడు.ఇంతకీ మహి తల్లి ఎవరు ? ఎందుకు విరాజ్ తో ఆమె విడిపోవాల్సి వస్తుంది.చివరికి ఏమవుతుంది అనేది మిగితా కథ.

విశ్లేషణ :

కథ పరంగా చూస్తే చాలా సింపుల్.భారీ ట్విస్టులు పెద్దగా కమర్షియల్ హంగులు వుండవు కానీ సినిమా మాత్రం కట్టిపడేసింది.స్టోరీలో వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నాడు దర్శకుడు కానీ ఒక్కసారి కథ టేక్ ఆఫ్ అయ్యాక సినిమాతో ట్రావెల్ చేస్తాం.ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయింది.
ఇక సెకండ్ హాఫ్ లో ఆ ఫ్లో ఎక్కడా తగ్గలేదు.చివరి 30నిమిషాలు ఏడిపించేసారు.భావోద్వేగాలు  అద్భుతంగా పండాయి.వీటికి కారణం దర్శకుడు రైటింగ్ ఒకటి అయితే అంతకుమించి నటన కూడా. ఓవరాల్ గా చూస్తే హాయ్ నాన్న ఓ మంచి ఎమోషనల్ డ్రామా థియేటర్ నుండి బయటికి వచ్చేటప్పుడు ఓ మంచి సినిమా చూశామని అనుకునే సినిమాలు చాలా అరుదు అందులో హాయ్ నాన్న ఒకటి.

నటీనటుల విషయానికి వస్తే నాని నటన సినిమాకు పెద్ద అసెట్.నానికి ఇలాంటి పాత్రలు కొత్తేమి కాకపోవడంతో అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు.ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో నాని నటనను మెచ్చుకొని తీరాల్సిందే.aఇక యష్ణ గా మృణాల్ అదరగొట్టింది.గ్లామర్ గా మాత్రమే కాదు యాక్టింగ్ పరంగా  కూడా తానేంటో చూపెట్టింది.తన కెరీర్ లో బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చింది.బేబీ కైరా కూడా చాలా బాగా చేసింది. మిగిలిన పాత్రల్లోనటించిన జయ రామ్, ప్రియదర్శి ,విరాజ్ అశ్విన్ తమ పాత్రల్లో నటించారు.

టెక్నికల్ గా చూస్తే మొదటి సినిమా అయినా కూడా ఎక్కడా పట్టు జారకుండా ఓ మంచి సినిమా అందించాడు దర్శకుడు శౌర్యువ్.తన చెప్పాలనుకుంది పెద్ద హంగమా లేకుండా సింపుల్ గా చెప్పేశాడు. సంగీతం విషయానికి వస్తే హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈసినిమాకు సంగీతం అందించాడు.సాంగ్స్ డీసెంట్ గా వున్నాయి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు తగ్గట్లు ఇచ్చాడు. షాను జాన్ కెమెరా పనితనం అదిరిపోయింది.విజువల్స్ సినిమా కు ఫ్రెష్ ఫీలింగ్ ను తీసుకొచ్చాయి.ఎడిటింగ్ ఓకే.నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా హాయ్ నాన్న ఓ మంచి ఎమోషనల్ డ్రామా మొదట్లో  కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగించిన  తర్వాత మాత్రం వావ్ అనిపించింది.నటన ,విజువల్స్ ,ఇంటర్వెల్ సీక్వెన్స్ ,క్లైమ్యాక్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.ఓ మంచి సినిమా చూడాలనుకుంటే ఫ్యామిలీ తో కలిసి హాయ్ నాన్నకు వెళ్లొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =