రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా కాంతార. ఈసినిమా కన్నడలో ఎలాంటి అంచనాలు లేకుండానే బాక్సాఫీస్ బరిలో దిగింది. కానీ అక్కడ ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ బిజీగా ఉందన్న వార్తలు కొంతకాలంగా వచ్చాయి. ఈనేపథ్యంలో ఈసినిమా నుండి అప్ డేట్ కోసం ఎదురుచూస్తున్న వారికి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఫస్ట్ లుక్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలను అమాంత పెంచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈసినిమాపై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఇన్ట్సా ద్వారా స్పందించారు. తన ఇన్ట్సా ద్వారా రిషబ్ శెట్టి, విజయ్ కిరగందూర్ ఇంకా టీమ్ మొత్తానికి అలానే ఫ్యూచర్ బ్లాక్ బస్టర్ కాంతార ఛాప్టర్ 1 కు ఆల్ ద బెస్ట్ అంటూ పోస్ట్ చేశాడు. మరి కాంతార సినిమా సమయంలో కూడా ప్రభాస్ ఈసినిమాను కన్నడలో చూసి తన ఇన్ట్సా ద్వారా ప్రశంసించాడు. అప్పట్లో కాంతార సినిమాకు అంత హైప్ రావడానికి ప్రభాస్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మళ్లీ ఈసినిమాకు బెస్ట్ విషెస్ అందించాడు. చూద్దాం మరి ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో.
ఇక ఈసినిమాను కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయనున్నాడు. భారీ బడ్జెట్ తో హోంబల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తుండగా.. అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తో పాటు హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్ కూడా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: