సలార్ ట్రైలర్ రిలీజ్ టైం రివీల్ 

Salaar Trailer Release Time Revealed

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈట్రైలర్ డిసెంబర్ 1న విడుదలకానుందని తెలిసిందే.ఈ ట్రైలర్ తోనే సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నారు.ఇక ఈ ట్రైలర్ రిలీజ్ టైం కూడా చెప్పేశారు.శుక్రవారం సాయంత్రం 7గంటల 19నిమిషాలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రికార్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది అయితే టీజర్ రిలీజ్ చేసినట్లు గా ట్రైలర్ ను కూడా సింగిల్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేస్తారా లేదా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారనేది ఆసక్తిగా మారింది.ఇక ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో అదరగొడుతుంది.తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ భారీ ధర పలుకుతున్నాయి.ప్రభాస్ క్రేజ్ తోపాటు కె జి యఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో భారీ గా బిజినెస్ చేస్తుంది.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.రవి బసూర్ సంగీతం అందిస్తున్నాడు.కెజియఫ్ 1&2 ,కాంతార వంటి సినిమాలను నిర్మించిన విజయ్ కిరగంధుర్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.డిసెంబర్ 22న సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 2 =