ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ – తేజ సజ్జా

Hero Teja Sajja Reveals Interesting Facts About Hanuman Movie

దర్శకుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా లీడ్ రోల్ నటించిన ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సూపర్ హీరో హనుమాన్‌ని లాంచ్ చేసి ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. బాలల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ పాట చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం, హనుమాన్ టీమ్ చిత్రంలోని మూడవ సింగిల్ ఆవకాయ ఆంజనేయ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. మాసీ బీట్‌ లతో కూడిన ఈ గ్రూవీ ఫోక్ సాంగ్ అనుదీప్ దేవ్ అద్భుతంగా స్వరపరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ.. “మనకి ఆపద వస్తే ఆంజనేయ స్వామి, ఆకలేస్తే ఆవకాయ..ఇది మన కల్చర్ లో బలంగా మనందరిలో పాతుకుపోయి వుంది. ఇదొక ఎమోషన్. అలాంటి కల్చర్ ని కమర్షియల్ వే లో చాలా గొప్పగా చూపించడానికి ప్రశాంత్ గారు ప్రయత్నించారు. దీనికి గ్రేట్ ట్యూన్ ఇచ్చిన అనుదీప్ గారికి, మంచి లిరిక్స్ ఇచ్చిన సింహా గారికి, అద్భుతంగా పాడిన సాహితి గారికి, హిందీలో పాడిన సునీధి చౌహాన్ గారికి మలయాళంలో పాడిన సితార గారికి థాంక్స్. అద్భుతమైన ఆలోచనని అంతే అద్భుతంగా విజువలైజ్ చేసిన ప్రశాంత్ గారికి థాంక్స్. ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్ లోకి రాబోతుంది. అందరూ థియేటర్ కి వచ్చి చూడండి. ఈ పండక్కి హనుమాన్ తో థియేటర్లో పండగ చేసుకుందాం’’ అని అన్నారు.

కాగా ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్ దీపక్‌ శెట్టి, వెన్నెల కిశోర్‌, సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ సహా పలు ఇతర భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతోంది. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమాను మొత్తం 12 భాషల్లో డబ్ చేస్తున్నామని, కొన్ని విదేశీ భాషల్లో సైతం రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − 6 =