బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ 3’. మనీశ్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషించింది. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ కామియో రోల్ లో కనిపించడం విశేషం. ఇక ‘టైగర్’ ప్రాంఛైజీలో భాగంగా ఇంతకుముందు వచ్చిన ‘ఏక్తా టైగర్’ మరియు ‘టైగర్ జిందా హై’ తర్వాత వచ్చిన సినిమా కావడంతో తొలినుంచీ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్యా చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రీతమ్ మ్యూజిక్ అందించాడు. దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ‘టైగర్ 3’ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ఇప్పటివరకూ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. కాగా సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో.. ‘టైగర్ 3’ టీమ్ అభిమానులను కలిసింది. శనివారం (నవంబర్ 18, 2023) ముంబై లోని ఓ థియేటర్‌కు వెళ్లిన చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో సల్మాన్ ఖాన్ ప్రేక్షకులకు మరియు అభిమానులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అభిమానుల కోరిక మేరకు టైగర్ 3 సినిమాలోని ఒక పాటకు కత్రినా కైఫ్‌తో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. దీంతో థియేటర్ ఒక్కసారిగా ప్రేక్షకుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Vibe 🔛#Tiger3InCinemas | #LekePrabhuKaNaam pic.twitter.com/o4UQwI0PXO
— Yash Raj Films (@yrf) November 17, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: