‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మంగళవారం చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీ, నటులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్‌కుమార్), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరయ్యారు. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ నటుడు ప్రభు మరియు ఆయన కుమారుడు, హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, విఘ్నేష్ శివన్ కూడా కమల్ జన్మదిన వేడుకకు హాజరై సందడి చేశారు. ఇక టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ మరియు ఆయన కుమార్తెలు ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఇదే వేడుకలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్ కూడా తళుక్కుమన్నారు. ఈ సందర్భంగా కమల్ హాసన్, విజయ్ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వీరితో పాటుగా ఎల్‌సీయూ (లోకేష్ సినిమాటిక్ యూనివర్స్) ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన చివరి రెండు చిత్రాలలో ఈ హీరోలు నటించారు. ‘విక్రమ్’లో కమల్ నటించగా.. ఇటీవలే విడుదలైన ‘లియో’లో విజయ్ టైటిల్ రోల్‌లో కనిపించారు. కాగా ‘విక్రమ్’ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా.. ‘లియో’ రూ.500 కోట్లకు మించి వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఎల్‌సీయూ ఫ్యాన్స్ దీని గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. త్వరలోనే వీరి కలయికలో సినిమా ఉండొచ్చని.. అది కూడా ఎల్‌సీయూ లో భాగంగా తీసే సినిమా కావొచ్చని ఊహాగానాలు చేస్తున్నారు. ఇక యథావిధిగా ఈ సినిమాకి లోకేష్ కనగరాజే దర్శకత్వం వహిస్తారని.. అయితే ఆ సినిమా రికార్డ్ స్థాయిలో రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధిస్తుందని అంచనాలు కూడా వేస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే రిలీజైన ‘లియో’ క్లైమాక్స్ లో.. విజయ్ కి కమల్ హాసన్ ఫోన్ చేసి మాట్లాడే సన్నివేశాన్ని అభిమానులు ఇప్పుడు గుర్తుచేసుకుంటున్నారు. అయితే.. వీరు కోరుకున్నట్లు ఇది వాస్తవరూపం దాలిస్తే.. మరో బ్లాక్ బస్టర్ పక్కా అని అయితే చెప్పొచ్చు. దీనికి ఉదాహరణగా ఇప్పటివరకూ ఎల్‌సీయూ లో 3 సినిమాలు రాగా.. అన్నీ ఇండస్ట్రీ హిట్స్ అనిపించుకున్నాయి. సో.. కమల్ హాసన్, విజయ్ కలయికలో సినిమా ఉండొచ్చని మూవీ లవర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: