జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే
ఈసినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. డేంజర్ పిల్లా అంటూ వచ్చే ఈ ఫస్ట్ సాంగ్ బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. బ్రష్ వేసుకో అంటూ వచ్చే సెకండ్ సాంగ్ ను నవంబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Brace yourself for the #ExtraOrdinaryMan‘s Second Single #BrushVesko on November 10th ❤️🔥@Jharrisjayaraj’s funky beats are going to get you dancing 😉#ExtraOrdinaryManOnDec8th@actor_nithiin #Rajasekhar @sreeleela14 @vamsivakkantham#SudhakarReddy #NikhithaReddy pic.twitter.com/Jwv0NB1iCD
— Sreshth Movies (@SreshthMovies) November 8, 2023
కాగా ఈసినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23వ తేదీన ఈసినిమాను విడుదల చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: