బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ విఎఫ్ఎక్స్ పనులు లేట్ అవుడుండటంతో ఈసినిమా రిలీజ్ లేట్ అయింది. ఫైనల్ గా సంక్రాంతికి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి అప్ డేట్స్ కూడా సరిగ్గా రావడంలేదు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా నుండి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. ఈసినిమా నుండి ప్రతి మంగళవారం అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వచ్చే మంగళవారం సినిమా రిలీజ్ వరకూ కూడా ప్రతి మంగళవారం అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు.
We started our On-Ground promotions from this Tuesday! There will be an exciting update from #HanuMan on every Tuesday till the release! 🙏🏽😊@Primeshowtweets #HanuManOnJan12th ❤️🔥 pic.twitter.com/hwEt8aXOGh
— Prasanth Varma (@PrasanthVarma) November 8, 2023
కాగా ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. ఈసినిమాను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: