విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమాల నుండి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇస్తు అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మణిరత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అప్ డేట్ వచ్చేసింది. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా కమల్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా కమల్ కు బర్త్ డే విషెస్ ను అందించాడు. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ సార్ కు హ్యాపీ బర్త్ డే.. ఇలానే మరేన్నో సంవత్సరాలు మాకు నటన పాఠవాలు నేర్పించాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు.
Wishing the Universal Star @ikamalhaasan sir a very happy birthday. May you continue to teach us for many more years.
— Jr NTR (@tarak9999) November 7, 2023
కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ శివ కొరటాల దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: