దక్షిణాది చిత్ర పరిశ్రమలలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణించిన విషయం తెలిసిందే. అలాగే విలక్షణ నటుడు నాజర్ తండ్రి కూడా కన్నుమూశారు. ఇక ఇది ఇలా ఉండగానే.. నిన్న కోలీవుడ్ ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేరన్న వార్త వినిపించింది. ప్రముఖ సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అయితే ఆయన మరణించిన వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నటుడు ఈశ్వరరావు గతకొంతకాలంగా అమెరికాలోని మిచిగాన్ లో ఉంటున్న తన కుమార్తె వద్దే నివసిస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అక్టోబర్ 31న తుదిశ్వాస విడిచారు. అయితే ఈశ్వరరావు కన్నుమూసిన మూడు రోజులు తరువాత ఆయన మరణవార్త వెలుగులోకి వచ్చింది. కాగా ఈశ్వరరావు మృతిపై తెలుగు చిత్రసీమ సంతాపం తెలిపింది. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ‘స్వర్గం నరకం’ చిత్రం ద్వారా ఈశ్వరరావు తెలుగు చిత్రసీమకు పరిచయమయ్యారు. నటించిన తొలి సినిమాలోనే తన నటనకు గానూ ఆయన కాంస్య నంది అవార్డును అందుకోవడం గమనార్హం.
ఇక అక్కడి నుంచి దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన ఈశ్వరరావు.. ఇండస్ట్రీలోని దాదాపు అందరు అగ్ర దర్శకులు మరియు నటులతో కలిసి పని చేశారు. ఈ క్రమంలో’ప్రేమాభిషేకం’, ‘యుగపురుషుడు’, ‘దయామయుడు’, ‘ఘరానా మొగుడు’, ‘ప్రెసిడెంట్ గారి అబ్బాయి’, ‘జయం మనదే’, ‘శభాష్ గోపి’, ‘దేవతలారా దీవించండి’, ‘కన్నవారిల్లు’, ‘ఖైదీ నెం 77’, ‘ఆడదంటే అలుసా’, ‘తల్లి దీవెన’, ‘బంగారు బాట’ వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. ఇలా దాదాపు 200కు పైగా సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలోను ఆయన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా మరోవైపు మాలీవుడ్ సినీ పరిశ్రమను కూడా వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్నిరోజుల క్రితం ప్రముఖ టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి మరువక ముందే మరో టీవీ నటి డాక్టర్ ప్రియ గుండె పోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. గర్భిణి అయిన ఆమె జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షల సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. అయితే సకాలంలో స్పందించిన వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బతికించగలిగారు. కాగా చిత్ర పరిశ్రమలలో సీనియర్, జూనియర్ అన్న భేదం లేకుండా ఇలా వరుస మరణాలు సంభవించడం బాధాకరం. ఇక తమ నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ప్రముఖుల మరణాలకు సంతాపం ప్రకటిస్తూ.. వారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగు ఫిల్మ్ నగర్ తరపున కోరుకుంటున్నాం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: