స్టార్ డైరెక్టర్ శంకర్,లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇండియన్ 2.వీరి కాంబో లో ఇంతకుముందు వచ్చిన వచ్చిన కల్ట్ మూవీ ఇండియన్ కు సీక్వెల్ గా వస్తుంది ఈసినిమా.నిజానికి ఎపుడో పూర్తి కావాల్సిన ఈ సినిమా మధ్యలో అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది అయితే కొన్ని నెలల ముందు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కాగా ప్రస్తుతం తుది దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఇండియన్ 2 ఇంట్రో అంటూ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది చిత్ర బృందం.ఈ గ్లింప్స్ ను తెలుగు లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి రిలీజ్ చేయగా తమిళంలో రజినీకాంత్, కన్నడ లో సుదీప్,మలయాళంలో మోహన్ లాల్,హిందీ లో అమీర్ ఖాన్ రిలీజ్ చేశారు.
ఇక ఈ ఇంట్రో వీడియో ఇంట్రెస్టింగ్ గా వుంది.గ్లింప్స్ లో కమల్ హాసన్ లుక్ ను రివీల్ చేశారు.ఏ తప్పు జరిగిన నేను తప్పకుండా వస్తాను అంటూ కమల్ డైలాగ్ తో వీడియో స్టార్ట్ కాగా దేశంలో లంచం ప్రభావం ఏవిధంగా వుందో చూపిస్తూ లంచం బాధితులు కం బ్యాక్ ఇండియన్ అంటూ ర్యాలీలు చేసే సన్నివేశాలను చూపించారు.చివర్లో నమస్తే ఇండియా భారతీయుడు ఈజ్ బ్యాక్ అంటూ కమల్ డైలాగ్ తో వీడియో ను ముగించారు.ఓవరాల్ గా 118 సెకండ్ల వీడియో సినిమాఫై అంచనాలు పెంచేసింది.ఈ వీడియో చూస్తుంటే శంకర్ ఫస్ట్ పార్ట్ కు పర్ఫెక్ట్ సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నట్లు వుంది.
ఈసినిమాలో కాజల్ అగర్వాల్,రకుల్ ప్రీత్ సింగ్ ,సిద్దార్థ్,ఎస్ జె సూర్య,ప్రియా భవాని శంకర్ కీలకపాత్రల్లో నటిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ఈసినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇక గత ఏడాది విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు కమల్ హాసన్.ఈసినిమా 400కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.మరి ఇండియన్ 2 తో కూడా కమల్ మరోసారి అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: