బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన సినిమా స్కంద. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనగా వచ్చిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయి మిక్డ్స్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే రామ్ పోతినేని యాక్షన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా రామ్-శ్రీలీల కాంబినేషన్, యాక్షన్ ఎలిమెంట్స్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఈసినిమాను నేడు రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించార కూడా. ఇక చెప్పినట్టే నేడు ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సందర్బంగా రామ్ తన ట్విట్టర్ ద్వారా స్కంద వైబింగ్ అంటూ స్కంద ను చూస్తున్నట్టు ట్వీట్ చేశాడు. మరి థియేటర్లలో చూడటం మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Currently Vibing..🔥#SKANDA on @DisneyPlusHS pic.twitter.com/Byya2clzhC
— RAm POthineni (@ramsayz) November 2, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. ఇంకా ఈసినిమాలో సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్, అజయ్ పుర్కర్, దగ్గుబాటి రాజా, ప్రిన్స్ సెసిల్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను నిర్మించారు. సంగీతం థమన్, సినిమాటోగ్రఫీ సంతోష్ దేటేక్, ఎడిటింగ్ తమ్మిరాజు అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: