డ్యూయెట్ తో వస్తున్న ఆనంద్ దేవరకొండ

anand deverakonda new movie titled as duet

విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. అన్న సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చినా తన అన్న మార్క్ కనిపించకుండా తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. పెద్ద హడావుడి లేకుండా చిన్నసినిమాలు చేసుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. ఇక రీసెంట్ గానే బేబి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం ఉదయ్‌ శెట్టి దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా గం గం గణేశా. ఈసారి యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. తమిళ దర్శకుడు క్రిష్ మిథున్ డైరెక్టర్ గా ఆనంద్ దేవరకొండ హీరోగా ఒక సినిమా రానుంది. ఈసినిమా టైటిల్ ను నేడు ప్రకటించారు మేకర్స్. డ్యూయెట్ అనే టైటిల్ ను ఈసినిమాకు పెట్టారు. అంతేకాదు ఈసినిమాను నేడు పూజాకార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టారు. ఇక ఈ పూజా కార్యక్రమానికి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

కాగా ఈసినిమాలో అశోకవనంలో అర్జున కళ్యాణం ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాను స్టూడియో గ్రీన్ 2 బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.