బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా . క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ ను రీసెంట్ గానే రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి మొదటిపాటను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. హబీబీ జిలేబీ అంటూ వచ్చే ఈపాటను నవంబర్ 3వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు. వెంకీ చేతుల మీదుగా ఈసినిమా పాటను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు.
EXCITING NEWS: #HabibiJilebi, the electrifying first single from #Bubblegum, is set for a digital launch by everyone’s favourite Victory @VenkyMama garu.
Mark your calendars for November 3rd at 11:30 AM! Don’t miss out.
Vocals by: @Rahulsipligunj
Lyrics by: @LyricsShyam… pic.twitter.com/tOLTBY9SBs— People Media Factory (@peoplemediafcy) November 1, 2023
కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: