ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్.. ఫోటోస్ వైరల్

Varun Tej and Lavanya Tripathi Got Married in Italy, Ceremony Pics Gone Viral

టాలీవుడ్‌ స్టార్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌, హీరోయిన్ లావణ్య త్రిపాఠిలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం (నవంబర్‌ 1, 2023) రాత్రి గం. 7:18 ని.లకు వీరు వేదమంత్రాల సాక్షిగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని టస్కానీలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకలో కుటుంబ పెద్దలు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక వరుణ్ తల్లిదండ్రులు కొణిదెల నాగబాబు దంపతులు కొత్త కోడలిని సాదరంగా వారి కుటుంబంలోకి ఆహ్వానించారు. సంప్రదాయబద్ధంగా భారతీయ శైలిలో వీరి వివాహం జరుగగా.. హాజరైన అతిథులు అక్షింతలతో నూతన వధూవరులను దీవించి శుభాకాంక్షలు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వరుణ్‌, లావణ్యల వివాహానికి మెగా-అల్లు ఫ్యామిలీ మెంబర్స్ మరియు పలువురు సన్నిహిత మిత్రులు హాజరయ్యారు. వీరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సతీమణి అన్నా లెజ్నెవా, రామ్‌చరణ్-ఉపాసన, అల్లు అర్జున్‌-స్నేహా, హీరో నితిన్-షాలిని జంటలతో పాటు మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నీరజా కోన తదితరులు ఉన్నారు. వివాహం అనంతరం చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ సహా మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో కనువిందు చేశారు. నూతన దంపతులతో కలిసి వీరు ఫొటో దిగారు. దీనికి సంబంధించిన ఫొటోను మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియా ద్వారా పోస్టు చేయగా.. ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

కాగా వివాహ వేడుకల్లో భాగంగా అంతకుముందు జరిగిన కాక్‌టెయిల్, హల్దీ, మెహందీ సెలెబ్రేషన్స్‌ను నిర్వహించగా అతిథులందరూ పాల్గొని సందడి చేశారు. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహానికి మెగా-అల్లు కుటుంబ సభ్యులతో పాటు అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. వరుణ్ ఈ వేడుకను పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించుకోవాలని నిర్ణయించిన క్రమంలో వెడ్డింగ్‌ను ఇటలీలో ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు చిత్ర పరిశ్రమలోని ముఖ్యుల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హల్దీ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం VarunLav అనే హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిన సంగతే. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నారు. దీనిలో భాగంగా కొన్ని నెలల క్రితం వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇటలీలో వివాహం జరిగింది. ఈ క్రమంలో ఇప్పటికే వరుణ్‌ తేజ్‌, లావణ్య వెడ్డింగ్‌ కార్డ్‌ ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే, ఇటీవలే ‘గాంఢీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అనే మూవీలో నటిస్తున్నారు. అలాగే ‘పలాస’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ‘మట్కా’ అనే సినిమాను చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + thirteen =