దేవర సెట్ ను మిస్ అవుతున్నా

janhvi kapoor interesting post on devara movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. జనతా గ్యారేజ్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్లను సినిమాటోగ్రాఫర్ రత్నవేలు తన సోషల్ మీడియా ద్వారా అందిస్తూనే ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే మొదటిసారి జాన్వీ ఈసినిమా గురించి తన ఇన్ట్సా ద్వారా పోస్ట్ చేసింది. ఈసినిమా షూట్ కు బ్రేక్ ఇచ్చిన నేపథ్యంలో దేవర సెట్ ను మిస్ అవుతున్నా అంటూ తన పోస్ట్ లో పేర్కొంది. అంతేకాదు ఈసినిమాలోని తన లుక్ కు సంబంధించి కూడా ఒక ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

కాగా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 3 =