కలర్స్ స్వాతి మంత్ ఆఫ్ మధు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Colors Swathi’s Month of Madhu Movie OTT Platform and Release Date Fixed

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘భానుమతి & రామకృష్ణ’ ఫేమ్ శ్రీకాంత్ నాగోతి రచన, దర్శకత్వం వహించారు. క్రియేటివ్ ప్రొడక్షన్స్, హ్యాండ్‌పిక్డ్ స్టోరీస్ బ్యానర్స్​పై యశ్వంత్ ములుకుట్ల నిర్మించగా.. సుమంత్ దామ సహ నిర్మాతగా, రఘువర్మ పేరూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. కాగా నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి కలయికలో ఇది రెండో చిత్రం కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ ‘త్రిపుర’ అనే సినిమాలో కలిసి నటించగా.. ఇది వీరికి మంచి గుర్తింపు తెచ్చింది. లవ్ ఎమోషనల్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఎన్ఆర్ఐ తెలుగు గర్ల్ శ్రేయా నవేలి ఒక ముఖ్య పాత్రలో కనిపించగా.. రాజా రవీంద్ర, మంజుల ఘట్టమనేని, వైవా హర్ష, రాజా చెంబోలు, రుద్ర రాఘవ్, జ్ఞానేశ్వరి, రుచిత సాధినేని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక గతనెలలో (అక్టోబర్ 6న) థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే ఈ సినిమాకి క్రిటిక్స్ నుండి కూడా మిశ్రమ స్పందనే వచ్చింది. ఈ క్రమంలో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ‘ఆహా’లో విడుదల కానుంది. ఈ మేరకు సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది. నవంబర్ 3 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది. ఈ సందర్భంగా.. ‘కొన్ని సినిమాలు మనసుకు దగ్గరవుతాయి! అలాంటి వాటిలో ఒకటి’ ఈ సినిమా అని అందులో పేర్కొంది.

‘మంత్ ఆఫ్ మధు’ కథ ఏంటంటే..

మ‌ధుసూద‌న్ రావు(న‌వీన్ చంద్ర‌), లేఖ‌(క‌ల‌ర్స్ స్వాతి) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే వివాహం అనంతరం మ‌ధుసూద‌న్ మద్యానికి బానిస కావడంతో గొడవలు మొదలవుతాయి. ఈ క్రమంలో వివాహమైన కొద్దికాలానికే ప్రాణంగా ప్రేమించుకున్న వారు మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడాకులు కావాల‌ని కోర్టు మెట్లు ఎక్కుతారు. అయితే అనూహ్యంగా అమెరికా నుంచి వ‌చ్చిన మ‌ధుమ‌తి (శ్రేయా) అనే అమ్మాయి వీరి జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. మ‌ధుమ‌తి వలన మ‌ధుసూద‌న్ రావు, లేఖ‌ల జీవితాల్లో మార్పు వచ్చిందా? చివరకు వీరిద్దరు విడాకులు తీసుకున్నారా? లేదా? అసలు మ‌ధుమ‌తి అమెరికా నుంచి ఇండియాకు రావాల్సిన అవసరం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే ‘మంత్ ఆఫ్ మ‌ధు’ సినిమా చూడాల్సిందే.

కాగా ‘మంత్ ఆఫ్ మ‌ధు’ సినిమాలో ప్రధానంగా స్త్రీ స్వేచ్ఛ‌తో పాటు భార్యాభ‌ర్త‌ల మధ్య ఉండే అనుబంధం గురించి సందేశాత్మ‌క కోణంలో ఆవిష్క‌రించారు. నవీన్ చంద్ర ఇందులో ఒకటి ప్ర‌భుత్వ ఉద్యోగిగా, ఇంకొకటి మద్యానికి బానిసైన భర్తగా రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించగా.. స్వాతి కాలేజీ అమ్మాయిగా, గృహిణిగా డిఫ‌రెంట్ వేరియేష‌న్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో నటించింది. ఇక ఈ సినిమాలో వీరిద్ద‌రి న‌ట‌న బాగుంద‌నే ప్ర‌శంస‌లు వ‌చాయి. ఇక స్వాతి, నవీన్ చంద్ర, దర్శకుడు శ్రీకాంత్ నాగోతి కాంబినేషన్‌లో వచ్చిన ‘ భానుమతి & రామకృష్ణ’ చిత్రం ఓటీటీలో మంచి విజయం సాధించిన నేపథ్యంలో.. ఇప్పుడు ‘మంత్ ఆఫ్ మ‌ధు’ సినిమా కూడా మరోసారి దానిని రిపీట్ చేయనుందని చిత్రబృందం భావిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 9 =