తెలుగు, తమిళ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న విలక్షణ నటుడు చియాన్ విక్రమ్. తన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యత ఉండేలా చూసుకుంటాడు. ఇక రీసెంట్ గానే పొన్నియన్ 2 సెల్వన్ సినిమాతో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ తో వచ్చేస్తున్నాడు చియాన్ విక్రమ్. పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా తంగలాన్. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కి జనవరి 26వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పుడు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెడుతున్నారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈసినిమా టీజర్ ను నవంబర్ 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. హైద్రాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ స్క్రీన్ 1 పై ఈ టీజర్ ను లాంచ్ చేయనున్నారు. సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.
Discover a lost world of intrigue and witness a fiery tale at the #ThangalaanTeaser Launch Event. 🤩💥
📍AMB Cinemas-Screen 1, Hyd.
🗓️ 1st Nov @ 6️⃣ PM ⏰Book Event Passes Here: 🎟️ https://t.co/hPBWvYazYo#Thangalaan @chiyaan @Thangalaan @beemji @kegvraja @officialneelam… pic.twitter.com/FvI6v36Wsm
— Studio Green (@StudioGreen2) October 30, 2023
కాగా పార్వతి తిరువొత్తు, డేనియల్ కాల్టాగిరోన్, మాళవిక మోహనన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: