‘తలైవా 171’లో రజినీలోని నెగెటివ్ షేడ్స్‌ను చూపిస్తా – లోకేశ్‌ కనగరాజ్‌

Thalaivar 171 Update: Lokesh Kanagaraj Likely To Elevate Rajinikanth in Negative Role

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ నటించనున్న ‘తలైవా 171’ గురించి ఒక అద్దిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో రజినీకాంత్‌ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించన్నారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ దీనిపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా రజనీకాంత్‌ ప్రస్తుతం ‘తలైవా 170’ సినిమా చేస్తున్నారు. ‘జై భీమ్‌’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దీని తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘తలైవా 171’ చేయనున్నారు. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ సినిమాలతో తన సత్తా ఏంటో చూపించారు లోకేశ్‌. ఇక ఇటీవలే కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా నటించిన ‘లియో’ మూవీతో లోకేష్ మరోసారి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు రజినీకాంత్ ‘జైలర్’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో లోకేశ్‌ కనగరాజ్, రజినీకాంత్‌ కాంబోలో రూపొందనున్న సినిమా కావడంతో ‘తలైవా 171’ గురించి అంతా ఎక్జయిటింగ్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేశ్ కనగరాజ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఇది నా కెరీర్‌లోనే బెస్ట్ స్టోరీ. రజినీ సర్ లోని విలనిజం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే మేము కలిసి చేయబోయే ‘తలైవా 171’లో ఆయనలోని నెగెటివ్ షేడ్స్‌ను మరోసారి చూపించాలనుకుంటున్నా. ‘రోబో’ తర్వాత ఆ రేంజ్‌లో తలైవా విలనిజాన్ని ఇందులో ఎలివేట్‌ చేసే అవకాశం దక్కింది. స్టోరీ ప్రకారం ఆయన పాత్రకు చాలా షేడ్స్‌ ఉన్నాయి. కాబట్టే రజినీకాంత్‌ విలనిజాన్ని నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేయాలని భావిస్తున్నా. అయితే ఈ చిత్రంలో స్క్రిప్ట్‌ డిమాండ్ మేరకే రజినీలోని నెగటివ్ కోణాన్ని పూర్తిగా చూపిస్తున్నా” అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

కాగా భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేశ్‌ సినిమాటిక్ యూనివ‌ర్స‌ల్‌ (ఎల్‌సీయూ) అనే ఒక కొత్త కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో లోకేశ్‌ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. లోకేశ్‌ ఇచ్చిన అప్‌డేట్‌పై మూవీ లవర్స్‌తోపాటు ‘తలైవా’ అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్‌ హౌజ్‌ లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తోండగా.. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం సమకూర్చనున్నారు. అయితే ఇది ఇలాఉంటే.. రజినీ మరోవైపు తన కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్‌ డైరెక్షన్‌లో ‘లాల్‌ సలామ్‌’ అనే సినిమాలో నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. 2024 పొంగళ్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − three =