యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నాడు. కీడా కోలా అంటూ క్రైమ్ కామెడీ సినిమాగా రాబోతున్న ఈసినిమాలో ఈసినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే పలు అప్డేట్లు ఇచ్చారు. ఇక అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అక్టోబర్ 29 తేదీన హైద్రాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ మాల్ లో సాయంత్రం 6.30 గంటల నుండి ఈ ప్రీ రలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అతిథిగా రానున్నాడు. ఇక విషయాన్ని అధికారికంగా తెలియచేశారు మేకర్స్.
Gola maamulga undakudadhu inkaa! 🥁
Mana @TheDeverakonda for the Pre-release event of #KeedaaCola on OCT 29#KeedaaColaOnNov3
🎟 https://t.co/EOjsaM8LZ2@TharunBhasckerD @RanaDaggubati @VivekSudhanshuK @sripadnandiraj @UpendraVg @Mesaikrishna @KaushikNanduri @saregamasouth pic.twitter.com/cpnJ8GhAFT— VG Sainma (@VGSainma) October 28, 2023
కాగా బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1 గా తెరకెక్కబోతోన్న ఈసినిమాను భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎజె ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: