దేవర కొత్త షెడ్యూల్‌ షురూ.. గోవాకు పయనమైన జూ. ఎన్టీఆర్

Jr NTR Joins The New Schedule of Devara in Goa

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోంది. ఇందులో జూనియర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. అంతేకాకుండా.. వరల్డ్‌వైడ్‌ బ్లాక్ బస్టర్ హిట్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడం వలన కూడా ‘దేవర’పై అంతటా ఆసక్తి నెలకొంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. జాన్వీ కపూర్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్ సన్నివేశాలతోపాటు, సైఫ్‌ అలీఖాన్ తో ఫైట్ సీన్స్ తీశారు. అలాగే శంషాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన షిప్‌ సెట్‌లో ఇంట్రడక్షన్ సీన్స్, అండర్‌ వాటర్‌ యాక్షన్ సీన్స్ వంటివి తెరకెక్కించారు. ఇప్పటికే పలు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు సినిమాకు కీలకంగా నిలచే సన్నివేశాల చిత్రీకరణకు చిత్ర బృందం గోవాకు బయలుదేరింది. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన యాక్షన్ సీన్స్ సహా కొన్ని పాటలు చిత్రీకరించాలని దర్శకుడు ప్లాన్ చేశారట. ఈ షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ కూడా చేరనున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ‘దేవర’ కొత్త షెడ్యూల్ గోవాలో ప్రారంభమయింది. నేటినుంచి అక్కడ కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగనుంది. దీనిలో పాల్గొనేందుకు హీరో ఎన్టీఆర్ గోవాకు చేరుకున్నారు. ఇక ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయదశమి సందర్భంగా.. ‘దేవర’ మూవీ మేకర్స్ ఆయుధ పూజ షురూ చేశారు. దీనిలో భాగంగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో “ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆయుధం ఏంటంటే..? ఆ ఆయుధాన్ని పట్టుకున్న చేయి” అంటూ ఒక కాప్షన్ జోడించారు. ఇందులో ఎన్టీఆర్ చేయి కనిపిస్తూ ఉండగా.. చేతిలో ఒక పదునైన ఆయుధాన్ని ధరించి ఉన్నాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.

ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్​పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా.. సాబు సిరిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ సినిమా మొదటి పార్టు వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ సినిమా తర్వాత తారక్ ‘వార్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై థ్రిల్లర్‌లో హృతిక్ రోషన్‌తో కలిసి ఆయన నటించనున్నారు. అలాగే ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ భారీ చిత్రం చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.