యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి – అరుణ్ భీమవరపు

Love Me Director Arun Bhimavarapu Says Thanks to Dil Raju

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లవ్ మీ’. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయి‌న్‌గా నటిస్తుండగా.. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మే 25న రిలీజ్ స్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు ‘లవ్ మీ’ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్రయూనిట్ మాట్లాడుతూ మూవీ విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ భీమవరపు మాట్లాడుతూ.. “ఈ మూవీతో ఓ దర్శకుడి పుట్టుకను చూడబోతోన్నారు. సీతమ్మ, సతీదేవీ ఇలా అందరూ చనిపోయి దేవతలు అయ్యారు. దివ్యవతి చనిపోయి దెయ్యం ఎందుకు అయింది అంటూ అర్జున్ చేసే ప్రయాణమే ఈ చిత్రం. శివ పార్వతులు, సతీ దేవీ, గంగా దేవీల్లాంటి పాత్రలు ఈ చిత్రంలో ఉంటాయి. ఆర్జున్ అనే పాత్రలో ఆశిష్ కనిపిస్తాడు. అర్జున్ కారెక్టర్‌లో శివుడి రిఫరెన్సులు కనిపిస్తాయి. యుద్దం చేయడం కంటే ప్రేమించడానికే ఎక్కువ గట్స్ కావాలి. మనిషి ప్రేమించాలంటేనే ఎంతో ధైర్యం, గట్స్ ఉండాలి.. అలాంటిది దెయ్యాన్ని ప్రేమించాలంటే ఇంకెంత గట్స్ ఉండాలి. ఈ పాత్రను ఆశించే ఎంతో ఇష్టంగా పోషించారు. గంగాదేవీ లాంటి పాత్రను వైష్ణవి పోషించారు. ఈ ప్రపంచాన్ని ప్రేమే నడుస్తోంది. వై? అనే క్వశ్చన్స్ లేకుండా వావ్ అని సినిమాను చూసి ఎంజాయ్ చేయండి” అని అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.