అమ్మని గుర్తుచేసుకుంటూ.. మహేష్ బాబు చెల్లి ఎమోషనల్ పోస్ట్

Mahesh Babu's Sister Priyadharshini Shares Emotional Post About Their Mother Indira Devi

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, మరో నటుడు సుధీర్ బాబు సతీమణి ప్రియదర్శిని తమ మాతృమూర్తి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ సతీమణి ఇందిరాదేవిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కాగా గతేడాది అక్టోబర్ 17న ఇందిరాదేవి కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవలే ఇందిరాదేవి తొలి వర్ధంతి కార్యక్రమాన్ని ఘట్టమనేని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా.. ఘట్టమనేని కృష్ణ, ఇందిరాదేవిల ఫోటోలను ప్రత్యేకంగా అలంకరించారు. ఈ క్రమంలో ఘట్టమనేని అల్లుళ్ళు గల్లా జయదేవ్ మరియు సుధీర్ బాబు తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని పుష్పాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తల్లి ఇందిరాదేవిని గుర్తుచేసుకుంటూ ప్రియదర్శిని ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో.. “ప్రియమైన అమ్మా.. మీరు నాకు తల్లి మాత్రమే కాదు, నా నమ్మకం, గురువు కూడా. నా జీవితంలోని ప్రతి ఆనందం మరియు సరదాలు సహా అన్ని విషయాలలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా జీవితాన్ని ప్రేమతో నింపిన వ్యక్తివి. నేను మన ప్రత్యేక బంధాన్ని గౌరవిస్తాను. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన రోజు, నేను పూర్తిగా స్తబ్దురాలిని అయిపోయాను. కొన్ని రోజులుపాటు నన్ను నేను కోల్పోయాను. అయితే అప్పుడే నాకు ఒక విషయం స్ఫురణకు వచ్చింది. మీరు ఎల్లప్పుడూ నాతో ఉంటారని నేను గ్రహించాను. ఇది నాకు ఎక్కడలేని ధైర్యాన్నిచ్చింది. ఇప్పుడు నేను మీలాగే పని చేస్తున్నాను. మీరు ఎక్కడ ఉన్నా.. మీ అనంతమైన ప్రేమ మాకు రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్ముతున్నాను. మీ ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాను అమ్మా… ప్రేమతో కూడిన జ్ఞాపకం” అని ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు. ఇది చూసిన సూపర్ స్టార్ అభిమానులు.. మహేష్ బాబు కుటుంబసభ్యులు అందరికీ తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 9 =