చాలా గ్యాప్ తరువాత గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఇక ఇప్పుడు ఆ సినిమా జోష్ తో పలు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో నాయగన్ సినిమా వచ్చింది. ఆసినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి కలిసి పనిచేయనున్నారు. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. ఇక ఇప్పుడు ఈసినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. చెన్నైలో చిత్ర యూనిట్ తో కలిసి ఈసినిమాను ప్రారంభించారు. ఈసందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఈసినిమాకు సంబంధించిన టెక్నీషియన్ల వివరాలను వెల్లడించారు.
The dream awaits.✨
The beginning of #KH234 🥁💥#Ulaganayagan #KamalHaasan
#CelebrationBeginsNov7
#HBDUlaganayagan @ikamalhaasan #ManiRatnam @arrahman #Mahendran @bagapath @MShenbagamoort3 @RKFI @MadrasTalkies_ @RedGiantMovies_ @turmericmediaTM @dop007 @sreekar_prasad… pic.twitter.com/tRXjUk202o— Red Giant Movies (@RedGiantMovies_) October 27, 2023
కాగా రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు. సినిమాటోగ్రాఫర్ గా రవి కె చంద్రన్.. ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ పనిచేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: