ధనుష్ లో నన్ను నేను చూసుకున్నాను

shiva rajkumar interesting comments on captain miller

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా డిసెంబర్15వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో కన్నడ స్టార్ శివ కుమార్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. జైలర్ తరువాత తమిళ నుండి వస్తున్న మరో సినిమా ఇది. ఇదిలా ఉండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కుమార్ ధనుష్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈసినిమా కథ నా దగ్గరకు వచ్చినప్పుడు నా రోల్ చాలా బాగా నచ్చింది.. ఇంట్రెస్టింగ్ గా ఉంది. మొదటి నుండీ ధనుష్ అంటే నాకు ఇష్టం.. చాలా సార్లు తనలో నన్ను నేను చూసుకున్నాను.. తన స్టైల్, తను చేసే కామెడీ అన్నీ నన్ను నేను చూసుకున్నట్టే ఉండేది.. అంతేకాదు ఒక్కో సారి తనను చూస్తుంటే బ్రూస్లీ ని చూసినట్టు ఉంటుంది అని తెలిపారు.

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + sixteen =