మహేష్ బాబు ‘ఖలేజా’కి 13 ఏళ్లు.. డిఫరెంట్ క్యారక్టర్‌లో సూపర్‌స్టార్

Superstar Mahesh Babu's Khaleja Movie Completes 13 Years

టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్‌స్టార్ మహేష్ బాబుది ప్రత్యేక స్థానం. మహేష్ డైలాగ్ డెలివరీకి, యాక్టింగ్ స్టైల్‍కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక యాక్షన్ ఘట్టాల్లో ఆయన చూపుల్లో ఉండే ఇంటెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే కెరీర్ బిగినింగ్‌లో లవర్ బాయ్, సాఫ్ట్ నేచర్ తరహా క్యారెక్టర్లలో ఎక్కువగా కనిపించిన మహేష్.. ఆ తర్వాత కంప్లీట్ యాక్షన్ హీరోగా మారారు. ఈ క్రమంలోనే ‘ఒక్కడు’, ‘అర్జున్’, ‘అతడు’ ‘పోకిరి’ బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ ‘మహర్షి’.. ఇలా సీరియస్ టైప్ రోల్స్‌లో నటించారు. కానీ, మహేష్ బాబులో గొప్ప కామెడీ టైమింగ్ ఉంది. హాస్య సన్నివేశాల్లో ఆయన నటన చూస్తుంటే ఎంతో నేచురల్‍గా అనిపిస్తుంది. ‘మురారి’ ‘అతడు’ ‘పోకిరి’ సినిమాల్లో దీనిని మనం గమనించవచ్చు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కోవలో వచ్చిందే.. ‘ఖలేజా’ చిత్రం. ఈ చిత్రం రిలీజై నేటికి 13 ఏళ్ళు అవుతోంది. దీంతో మహేష్ అభిమానులు దీనిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంతకుముందు మనం చూడని మహేష్‌ని చూడొచ్చు. వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండో సినిమా ఇది. అంతకుముందు ఇద్దరూ కలిసి తొలిసారిగా ‘అతడు’ సినిమా చేశారు. ఇందులో ఆయన యాక్టింగ్, కామెడీ, క్యారక్టరైజేషన్.. ఒకటేమిటి? ప్రతి ఒక్కటీ కొత్తగా ఉంటుంది. ప్రత్యేకించి మహేష్ లోని కామెడీ యాంగిల్ బాగా ఎస్టాబ్లిష్ అయింది ఈ చిత్రంలో. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా విపరీతమైన అంచనాల వల్ల థియేటర్లలో అనుకున్నంతగా ఆకట్టుకోకపోయింది. అయితే ఆ తర్వాత బుల్లితెరపై సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా తప్పకుండా చూస్తాను అని లెజెండరీ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ చెప్పారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. ఇది ఎంతగా ప్రేక్షకులను అలరిస్తుందో అని. సాటివారికి సాయపడే ప్రతి మనిషి ఒక దేవుడే.. వారిలోనే భగవంతుడు కొలువై ఉంటాడు అనే కాన్సెప్టుతో తెరకెక్కింది ఖలేజా. ఒక సాధారణ కారు డ్రైవర్ అయిన కథానాయకుడు అనుకోని పరిస్థితుల్లో ఒక గ్రామానికి వెళ్లడం, ఆ ఊరి ప్రజలు అంతుచిక్కని సమస్యతో అల్లాడిపోతుండటం చూసి వారి సమస్యను హీరో పరిష్కరించడం.. కథగా చెప్పుకుంటే కొత్తగా ఏమీ అనిపించదు. కానీ, డైరెక్టర్ త్రివిక్రమ్ ‘దైవం మానుష్య రూపేణా’ అంటూ కొన్ని సోదాహరణలతో, సన్నివేశాలతో ఆసక్తి కలిగేలా రూపొందించడం విశేషం.

ఇక ‘ఖలేజా’లో మహేష్ సరసన అనుష్క శెట్టి తొలిసారి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మహేష్, అనుష్క మధ్య కెమిస్ట్రీ సూపర్. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిస్తాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో ఉండే సీన్స్ సినిమాకే హైలైట్. ఈ సీన్స్ లో మహేష్ హాస్య నటులు సునీల్, అలీలతో కలిసి అనుష్కను టీజ్ చేయడం నెక్స్ట్ లెవెల్. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ విలన్ రోల్ పోషించారు. కాగా ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మూడో సినిమా రాబోతోంది. దీనికి ‘గుంటూరు కారం’ అని టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదేవిధంగా మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మున్ముందు మరిన్ని చిత్రాలు రావాలని, అవి విజయం సాధించాలని కోరుకుంటూ.. తెలుగు ఫిల్మ్ నగర్ నుంచి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + sixteen =