నట సింహం బాలకృష్ణ, సక్సెస్ పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా రూపొందుతుంది. ఈ కాంబినేషన్ సెట్ అయినప్పటినుండే సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఇంకా పదిరోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ఇంకా స్పీడు పెంచారు. దీంతో ఈసినిమా నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా ఇంకా పాటలు, పోస్టర్లు కూడా ఒక్కోక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఉయ్యాలో ఉయ్యాలో సాంగ్ ను రిలీజ్ చేయగా అది మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ట్రైలర్ ను సిద్దం చేస్తున్నారు. అక్టోబర్ 8వ తేదీన సాయంత్రం 8గంటల 16 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాాగా ఈసినిమా నుండి మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అర్జున్ రాంపాల్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అర్జున్ రాంపాల్ రాహుల్ సాంగ్వి అనే పాత్రలో నటిస్తున్నాడు.
Introducing the National Award-Winning Actor @rampalarjun as the menacing #RahulSanghvi from #BhagavanthKesari 🔥
TRAILER TOMORROW @ 8:16 PM ❤️🔥
Massive Release Worldwide on October 19th💥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman… pic.twitter.com/mT6nh4LY12
— Shine Screens (@Shine_Screens) October 7, 2023
కాగా ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ ఈసినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: