మంగళవారం నుండి ఏమయిందో ఏమిటో సాంగ్ రిలీజ్

Emayyindho Emito lyrical song released from mangalavaaram movie

అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. అందులోనూ ఇప్పటి వరకూ వచ్చిన అప్ డేట్లను బట్టి ఈసినిమా కూడా కంటెండ్ ఒరియెంటెడ్ సినిమాగానే రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఇక నవంబర్ 17వ తేదీన ఈసినిమా ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే మొదటి పాట గణగణ మోగాలిరా అనే పాటను రిలీజ్ చేశారు. తాజాగా రెండో పాటను రిలీజ్ చేశారు. ఏమయిందో ఏమిటో అంటూ వచ్చే మెలోడియస్ పాటను రిలీజ్ చేయగా.. ఈపాట కూడా ఆకట్టుకునేలా ఉంది. అజ్మల్, పాయల్ మధ్య వచ్చే ఈపాట విజువల్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 18 =