గోపీచంద్ 32 మూవీపై కీలక అప్‌డేట్‌ ఇచ్చిన శ్రీను వైట్ల

Director Sreenu Vaitla Gives Interesting Update About Gopichand 32 Movie

టాలీవుడ్ మాచో స్టార్ గోపీచంద్ హీరోగా సీనియర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో కొత్త చిత్రం ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను తెరకెక్కించడంలో శ్రీను వైట్లది అందెవేసిన చేయి. అలాగే యాక్షన్ సినిమాలలో గోపీచంద్ నటన ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిన విషయమే. వీరిద్దరి కాంబోలో మూవీ అనౌన్స్ చేయడంతో దీనిపై అంతటా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతానికి ‘గోపీచంద్ 32’గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నూతన నిర్మాణ సంస్థ చిత్రాలయం స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1‌గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ శ్రీను వైట్ల కీలక అప్‌డేట్‌ ఇచ్చారు. అదేంటంటే.. ఈ చిత్రం షూటింగ్ ఇటలీలో ప్రారంభమైనట్లు తెలిపారు. గురువారం అక్కడి ప్రఖ్యాత మిలాన్‌ నగరంలో ఈ మూవీ యొక్క ఫస్ట్ షెడ్యూల్ మొదలైనట్లుగా దర్శకుడు శ్రీను వైట్ల వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని షేర్ చేశారు. కాగా ఈ షెడ్యూల్‍లో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోతోన్న ఈ మూవీకి కెవి గుహన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా.. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పనిచేయనున్న ఇతర నటీనటులు, మరికొందరు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అయితే మరోవైపు గోపీచంద్ ‘భీమా’ అనే మూవీలో నటిస్తున్నారు. దీనికి ప్రముఖ కన్నడ దర్శకుడు ఎ హర్ష దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 14గా నిర్మాత కెకె రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =