బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా వస్తున్న సినిమా స్కంద. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా ను రూపొందిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమా రిలీజ్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సెప్టెంబర్ 15 వ తేదీన కావాల్సిన ఈసినిమా సెప్టెంబర్ 28వ తేదీకి పోస్ట్ పోన్ అయింది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అన్నీ సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ కు సిద్దం చేశారు. కల్ట్ మామ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ 18వ తేదీన ఈపాటను రిలీజ్ చేయనున్నారు.
CULT MODE #CultMama Arrives on Sept 18th #SkandaOnSep28
Ustaad @ramsayz @sreeleela14 #BoyapatiSreenu @UrvashiRautela @saieemmanjrekar @MusicThaman @srinivasaaoffl @SS_Screens @SantoshDetake @StunShiva8 @ZeeStudios_ @lemonsprasad @VarnikhaVisuals… pic.twitter.com/j3tUPSmxFs
— Srinivasaa Silver Screen (@SS_Screens) September 16, 2023
కాగా ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈసినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం ఐదు భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయబోతున్నారు
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: