ఫ్యాన్స్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

ntr emotional speech on his fans at siima awards 2023

ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది సైమా(సౌత్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ మూవీ అవార్ట్స్‌) అవార్డ్స్ వేడుక మొదలైంది. దుబాయ్ లో ఈవేడుక జరుగుతుండగా.. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకు దుబాయ్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వేదికైంది. ఇక ఈ వేడుకకు ఎంతో మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇదిలా ఉండగా 2023 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్‌ అవార్డును అందుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు గాను ఎన్టీఆర్‌కు ఈ అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ముందుగా జక్కన్న రాజమౌళికి థ్యాంక్స్.. నన్ను మళ్లీ మళ్లీ నమ్మినందుకు.. కొమరం భీమ్ పాత్ర చేస్తానని నమ్మినందుకు కృతజ్ఞతలు.. ఇంకా ఈసినిమాలో నటించిన నా కోస్టార్, నా బ్రదర్, మై ఫ్రెండ్ రామ్ చరణ్ ఒక పిల్లర్ లా సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇక చివరిగా ఫ్యాన్స్.. నా ఒడిదుడుకుల్లో.. నేను కిందపడ్డప్పుడల్లా నన్ను పట్టుకొని పైకి లేపినందకు.. నాకళ్ల వెంట వచ్చిన ప్రతి నీటిచుక్కకు వాళ్లు కూడా బాధపడినందుకు.. నేను నవ్వినప్పుడల్లా నాతో పాటు నవ్వినందుకు.. నా అభిమాన సోదరులందరికీ తలవంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తోనే ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. ఇంకా వార్2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =