భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. రీసెంట్ గాన ఈసినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. షూటింగ్ లో భాగంగానే నిఖిల్ రీసెంట్ గా వియాత్నం వెళ్లాడు. అక్కడే మూడు నెలలపాటు ఉండి ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ వంటి వాటిలో ట్రైనింగ్ తీసుకోనున్నాడు. అద్భుతమైన వార్ సీక్వెన్సులు ఉండే ఈ సినిమాలో నిఖిల్ ఎక్స్ టార్డినరీ స్టంట్స్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఈసినిమా తాజాగా ఈసినిమా నుండి సంయుక్త మీనన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె పుట్టినరోజు సందర్భంగా, ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఒక పెద్ద కోట ముందు నిండైన ఆభరణాలతో విగ్రహ రూపంలో యువరాణిలా కనిపిస్తుంది సంయుక్త. ఆమె చేతిలో ఒక పక్షి కూడా వుంది. ప్రస్తుతం సంయుక్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Happy Birthday to Our #Swayambhu Heroine @iamsamyuktha_
Wishing you Happiness , Health even more Blockbusters this year 😇 pic.twitter.com/FbpZT2JSoS— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2023
కాగా ఈసినిమాకు మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫి అందిస్తుండగా. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఎం.ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగరి డైలాగ్స్ అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: