ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వస్తున్న సినిమా లియో. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కారక్రమాలతో బిజీగా ఉంది. మరో వైపు ఈసినిమా టికెట్ బుకింగ్స్ ను కూడా మొదలుపెట్టేశారు. ఈ నేపథ్యంలో యూకే లో లియో తన హవా చూపిస్తున్నాడు. యూకే లో టికెట్ బుకింగ్స్ న ఓపెన్ చేయగా కొద్ది గంటల్లోనే పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. తాజాగా ఈసినిమా 18000 టికెట్లను బుక్ చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. అంతేకాదు ఇంకా పలు షోస్, స్క్రీన్స్, థియేటర్లు యాడ్ చేయనున్నట్టు కూడా తెలిపాడు.
Power kick-u from our UK family! Over 18,000 tickets sold for #LEO. Cinemas are buzzing, and we’re going to add more shows, screens, and theatres (especially for our Telugu cinema lovers)! 🤜🔥🧊
Words can’t describe the love you’ve shown for #AhimsaEntertainment 🙏🏽 pic.twitter.com/8NBKPDpRUx
— Ahimsa Entertainment (@ahimsafilms) September 12, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.