తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే. జిగర్ తండా డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రోల్, సౌండ్, యాక్షన్ అంటూ మొదలైన టీజర్ అయితే ఆకట్టకుంటుంది. టీజర్ లో డైలాగ్స్ పెద్దగా లేవు కానీ సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. ఇంకా లారెన్స్ ముక్కుపోగుతో కొత్త మేకోవర్ తో ఆకట్టుకుంటున్నాడు. మరి టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
ఇదిలా ఉండగా ఈ సినిమా లో లారెన్స్ హీరో గా నటిస్తుండగా ఎస్ జే సూర్య కూడా మరో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. తిరునవుక్కరుసు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ ఏడాది దీపావళికి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: