యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క జంటగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ తోపాటు మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి రోజు ఈసినిమా పర్వాలేదని వసూళ్లను సొంతం చేసుకోగా రెండో రోజు నుండి అనుహ్యంగా పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.4రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 25కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకొంది. ఈరోజు తో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేయనుంది.మరో రెండు వారాల వరకు పెద్ద సినిమాల విడుదలలేకపోవడంతో ఫుల్ రన్ లో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మంచి లాభాలను తీసుకురానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఓవర్సీస్ లో ఈసినిమా ఇప్పటికే హిట్ అనిపించుకొని బ్లాక్ బాస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ 1మిలియన్ డాలర్ల కు పైగా వసూళ్లను రాబట్టుకుంది. మహేష్ బాబు పి డైరెక్ట్ చేసిన ఈసినిమాకు రధన్ సంగీతం అందించగా యూవీ క్రియేషన్స్ నిర్మించింది.ఈసినిమాతో నవీన్ పోలిశెట్టి హ్యాట్రిక్ అందుకున్నాడు.ఇంతకుముందు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ,జాతిరత్నాలుతో వరుసగా రెండు విజయాలు అందుకోగా తాజాగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: