టాలీవుడ్ అగ్రహీరో విక్టరీ వెంకటేష్ కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం వెంకీ నుండి తెలుగులో వస్తున్న సినిమా సైంధవ్. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. మరోవైపు ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. నటి శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ సింగ్, అలానే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఇంకా ఆండ్రియా పాత్రలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక అప్ డేట్ వచ్చింది. సెంధవ్ కోసం వెంకీ శ్రీలంక వెళ్లినట్టు తెలుస్తుంది. వెంకీతో పాటు కొంతమంది స్టాఫ్ కూడా అక్కడికి వెళ్లినట్టు సమాచారం. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట చిత్రయూనిట్.
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: