మరో ఇంటర్నేషనల్ అవార్డుకు నామినేట్ అయిన బ‌ల‌గం

Balagam Nominated For International Sound And Film Music Festival

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్‌రాజు వారసులైన హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, శిరీష్‌ సమర్పణలో నిర్మించిన సినిమా బలగం. వేణు ఎల్దండి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కింది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో దాదాపు అందరూ కొత్త నటులే నటించడం విశేషం. మార్చి 3వ తేదీన చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన బలగం సినిమాకు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా సాధించిన అవార్డులకైతే కొదువేలేదు. ఇప్పటికే అనేక జాతీయ‌, అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు అందుకున్నది. ఉగాది బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకున్న బలగం మూవీ.. అనంతరం పలు అంతర్జాతీయ వేదికలపై కూడా సత్తా చాటింది. ఈ క్రమంలో 100కి పైగా అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకుని రికార్డ్ సృషించింది. ఈ నేపథ్యంలో బలగం సినిమా తాజాగా మ‌రో అంతర్జాతీయ అవార్డు కోసం పోటీ ప‌డుతోంది. ‘ఇంట‌ర్నేష‌న‌ల్ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌’లో ఒక ప్రత్యేక విభాగం కింద బరిలో నిలిచింది. ‘బెస్ట్ ఒరిజిన‌ల్ స్కోర్ ఫీచ‌ర్‌’ క్యాట‌గిరీలో బ‌ల‌గం సినిమా నామినేట్ అయింది. ఈ మేరకు చిత్ర బృందం సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై వెల్ల‌డించింది.

ఈ క్రమంలో బ‌ల‌గం చిత్రం పేరొందిన హాలీవుడ్ సినిమాల‌తో తలపడుతోంది. బెస్ట్ సౌండ్ ఎడిటింగ్ విభాగంలో ‘అవ‌తార్‌: ది వే ఆఫ్ వాట‌ర్‌’ మరియు ‘టాప్ గ‌న్: మావెరిక్’ సినిమాల‌తో బ‌ల‌గం పోటీ ప‌డ‌టం ప‌ట్ల చిత్ర నిర్మాణ సంస్థ ‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌’ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. అయితే ఇవి కేవలం సంగీతానికి సంబంధించి ఇచ్చే అవార్డులు కావడం గమనార్హం. ఒకవేళ ఈ అవార్డు గెలుచుకుంటే.. బలగం చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో పేరు ఇంట‌ర్నేష‌న‌ల్ స్థాయిలో మారుమోగుతోంది. కాగా ఈ ఫెస్టివ‌ల్‌లో సుమారు 82 దేశాల‌కు చెందిన 1074 సినిమాలు ప‌లు విభాగాల్లో పోటీ ప‌డుతున్నాయి. ఇక వ‌చ్చే నెల 14న క్రొయేషియాలో జ‌రుగనున్న వేడుక‌ల్లో నిర్వాహ‌కులు విజేత‌ల‌ను ప్ర‌క‌టించనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 12 =