చంద్రముఖి 2 విడుదల కూడా వాయిదా 

Chandramukhi 2 gets a new release date

ఈనెల 15న విడుదలకావాల్సిన సినిమాలు ఒక్కొక్కటి గా వాయిదాపడుతున్నాయి.అందులో భాగంగా టిల్లు స్క్వేర్ అలాగే స్కంద ఇదే డేట్ కూడా విడుదలకావల్సి ఉండగా వెనక్కి వెళ్లిపోయాయి.స్కంద ఈనెల 28న వస్తుండగా టిల్లు స్క్వేర్ నవంబర్ కు వెళ్ళిపోయింది.ఇక ఇప్పుడు ఈజాబితాలో మరో సినిమా చేరిపోయింది.అదే చంద్రముఖి 2.ఈసినిమాకూడా 15న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఈనెల 28న రిలీజ్ అవుతుంది.అనుకున్న సమయానికి సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా ఆలస్యంగా విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు.ఈసందర్భంగా న్యూ రిలీజ్ డేట్ తో కూడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కల్ట్ మూవీ చంద్రముఖి సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాలో రాఘవ లారెన్స్ ,కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించగా వడివేలు,రావు రమేష్,లక్ష్మి మీనన్,మహిమా నంబియార్ కీలక పాత్రలు పోషించారు. చంద్రముఖి డైరెక్టర్ పి వాసునే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.

ఇక ఈసినిమా కుడా వెనక్కి వెళ్లిపోవడంతో ఈనెల 15న మార్క్ అంథోని ఒక్కటే సోలోగా విడుదలవుతుంది.విశాల్,ఎస్ జె సూర్య లీడ్ రోల్స్ నటించగా సునీల్,రీతూ వర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఇటీవల విడుదలైన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.మార్క్ అంథోని తమిళంతోపాటు తెలుగు,హిందీలో కూడా విడుదలకానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − two =