సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే కదా. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి సంచలన విజయం అందుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. రష్మిక కూడా ఎప్పటినుండో షూటింగ్ లో పాల్గొంటుంది కూడా. ఈ నేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ స్పాట్ కు సంబంధించిన ఫొటోను రిలీజ్ చేసింది రష్మిక. ఒక బంగ్లాకు సంబంధించిన ఫొటోను షేర్ చేసింది. ఇక ఈ బంగ్లాలోనే రష్మిక, అల్లు అర్జున్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది.
Our #Srivalli @iamRashmika shares her excitement with a pic from the lavish sets of #Pushpa2TheRule ❤️
Icon Star @alluarjun @aryasukku @ThisIsDSP #FahadhFaasil @SukumarWritings @MythriOfficial @TSeries pic.twitter.com/DnAXv80f3u
— Pushpa (@PushpaMovie) September 8, 2023
కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: