జవాన్ మూవీపై మహేష్ మళ్ళీ ట్వీట్.. ఈసారి ఓ రేంజ్‌లో

Mahesh Babu Reviews Shah Rukh Khan's Jawan Movie

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జవాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ అర్ధమయింది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంతటా టాక్ వచ్చింది. ఇక ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లు చూసి సినీ పండితులు సైతం షాకవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జవాన్‌ చిత్రం ఘనవిజయం సాధించడంపై స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. జవాన్‌ బ్లాక్ బస్టర్ సినిమా. డైరెక్టర్ అట్లీ కింగ్‌ లాంటి షారుఖ్‌ ఖాన్‌తో కింగ్‌ సైజ్‌ ఎంటర్‌టైనమెంట్‌ అందించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇది తన కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్‌గా నిలిస్తుంది. ఇక షారుఖ్ ఖాన్.. తనదైన ఆరా, ఛరిష్మా మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తో తనకి మరెవరూ సాటిలేరు అన్నట్లుగా ఉన్నాడు. హి ఈజ్ ఆన్ ఫైర్. జవాన్ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తాడు’ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ‘జవాన్‌’ సినిమా విడుదల సందర్భంగా కూడా ముందురోజు మహేష్ బాబు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా ‘ఇట్స్ టైమ్ ఫర్ జవాన్.. అంటూ మూవీ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ పవర్ మొత్తం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని, ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నానని, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూసేందుకు ఎదురు చూస్తున్నానని అందులో చెప్పారు.

ఇక మహేష్ ట్వీట్‌పై షారుఖ్ ఖాన్ కూడా స్పందించారు. ఆయన కూడా ట్విటర్‌లో బదులిస్తూ.. ‘మహేష్‌ బాబుకు థ్యాంక్యూ. మీరు సినిమాను ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఎప్పుడు సినిమాకు వెళ్తారో చెప్పండి. మీతో పాటు కలిసి నేను కూడా సినిమా చూస్తాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు నా లవ్’ అని రిప్లై ఇచ్చారు. ఇలా రెండు చిత్ర పరిశ్రమలకు చెందిన అగ్ర హీరోలు ఇద్దరూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ట్వీట్స్ చేసుకోవడం పలువురిని ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 20 =