భోళాశంకర్ మూవీ రివ్యూ

chiranjeevi bholaa shankar telugu movie review

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా టీజర్, ట్రైలర్, పాటల తోనే సినిమాకు కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది.. ఎలా ఉంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు..చిరంజీవి, తమన్నా,కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను తదితరులు
దర్శకత్వం.. మెహర్ రమేష్
బ్యానర్స్.. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
నిర్మాతలు.. రామబ్రహ్మం సుంకర
సంగీతం..మహతి సాగర్
సినిమాటోగ్రఫి.. డూడ్లే

కథ

శంకర్ (చిరంజీవి) చెల్లి మహాలక్ష్మీ(కీర్తి సురేష్) తో కలిసి కలకత్తా వెళ్లి అక్కడ జీవనం సాగిస్తుంటాడు. మరోవైపు కలకత్తాలో అప్పటికే అమ్మాయిల కిడ్నాప్ లు కలకలం రేపుతుంటాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతుంటారు. ఆసమయంలో ఓసారి కిడ్నాప్ గ్యాంగ్ లోని ఒక మనిషిని గుర్తుపట్టి పోలీసులకు సమాచారం అందిస్తాడు. అనంతరం శంకర్ కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి.. ? శంకర్ మాఫియాను ఎందుకు టార్గెట్ చేశాడు..? చివరికి మాఫియాను ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈసినిమా కథ..

విశ్లేషణ

ఇక ఈసినిమా కథ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేదాళం సినిమాను చూసిన వారికి అర్థమైపోతుంది. అయితే ఇక్కడ మన ప్రేక్షకులనకు ఏంకావాలో తెలుసు కాబట్టి రీమేక్ అయినా కూడా అందుకు తగ్గట్టుగా మార్పులు చేస్తుంటారు డైరెక్టర్లు. గాడ్ ఫాదర్ సినిమా కూడా రీమేకే అయినా కూడా జస్ట్ ప్లాట్ మాత్రమే అది ఉంటుంది.. చాలా వరకూ మార్పులు చేసి రిలీజ్ చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు భోళా శంకర్ లో స్ట్రిప్ట్ పరంగా చాలా మార్పులు చేశాడు మెహర్ రమేష్. ఆ విషయంలో మాత్రంమెహర్ రమేష్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ముఖ్యంగా తను యాడ్ చేసిన కొన్ని ఎలిమెంట్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయి అని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ ను అనుకరించడం.. ఇంకా ఖుషి సినిమాలోని నడుం సీన్ ను శ్రీముఖితో రీక్రియేట్ చేయడం థియేటరల్లో ఈలలు వేయిస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మెగా అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తుంటారు. అంతేకాదు ఆయన యాక్టింగ్ గురంచి కానీ, డ్యాన్స్ లు స్క్రీన్ ప్రెజెన్స్ గురించి కానీ ఇప్పుడు కొత్తగా చెప్పుకునేది కూడా లేదు. రీ ఎంట్రీ తరువాత బాస్ ను వెండితెరపై చూసి ఎంజాయ్ చేయడమే. ఇక ఈసినిమాల కూడా చిరు ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో, కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. వాల్తేరు వీరయ్య సినిమా నుండి కాస్త మాస్ యాంగిల్ లోకి వచ్చిన చిరు ఈసినిమాలో కూడా మరోసారి మాస్ యాక్టింగ్ తో మెప్పించాడు. ముఖ్యంగా చూడాలని ఉంది సినిమాలో చిరు లుక్ గుర్తుకువస్తుంది ఈసినిమాలో చిరును చూస్తుంటే.

ఈసినిమాకు మరో ప్రధాన ఆకర్షణ చిరు-కీర్తి సురేష్ కాంబినేషన్. ఇక చెల్లెలి పాత్రలో నటించిన కీర్తి సురేష్ కూడా తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది. ఇక హీరోయిన్ గా చేసిన తమన్నా కామెడీ పాత్రలో నటించి తనలోని మరో యాంగిల్ ను చూపించింది. అతిథి పాత్రలో సుషాంత్ కూడా తను ఉన్నంత మేరకూ బాగానే నటించాడు. శ్రీముఖి కూడా ఈసినిమాలో మంచి పాత్ర దక్కిందని చెప్పొచ్చు. ఈసినిమా తరువాత మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. ఇక గెటప్ శ్రీను, వెన్నెల కిిషోర్, సత్య, బిత్తిరి సత్తి, లోబో, వేణు, తాగుబోతు రమేష్, ఆది, వైవా హర్ష తమ కామెడీతో అలరించారు. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతిక విభాగానికి వస్తే ఈసినిమాకు సంగీతం ప్రధాన బలంగా నిలిచిందన్న విషయం ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలను బట్టి అర్థమవుతుంది. మహతిసాగర్ అందించిన సంగీతం బాగుంది. అలానే డడ్లీ అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. విజువల్స్ కూాడా ఫ్రెష్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్, కామెడీ, ఎమోషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈసినిమాను ఖచ్చితంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు. కేవలం ఒక వర్గానికి మాత్రమే కాదు.. అన్ని వర్గాల వారికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా ఈసినిమా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + three =